జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24
విద్యుత్ షాక్ కు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ నుండి మంజూరైన 3 లక్షల 60 వేల రూపాయల చెక్కును పరకాల శాసన సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి.అందించినారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామనికి చెందినా బదావత్ ఈశ్వర్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై గాయపడగా విద్యుత్ శాఖ నుండి మంజూరైన రూ,, 3 లక్షల 60 వేల రూపాయల చెక్కును శనివారం హనుమకొండ భవానినగర్ లోని తన నివాసంలో బాదితునికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అందచేశారు. ఈశ్వర్ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.