జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు. సంక్షేమ హాస్టళ్లలో నివసించే విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాల యాల్లో జిల్లా కలెక్టర్ డా,, సత్యశారద ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇకపై విద్యార్థులకు ఏటువంటి సమస్య వచ్చిన తమ సమస్యలను చీటీపై రాసి పెట్టెల్లో వేస్తే, తనిఖీల వేళ కలెక్టర్ స్వయంగా ఫిర్యాదు పెట్టెలను తెరిచి చీటీలను చూస్తారు. పెట్టెలకు సంబంధించిన వాటి తాళాలు కూడా కలెక్టర్ వద్దే ఉంటాయని తెలుస్తుంది.
