Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కామారెడ్డి డిక్లరేషన్ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 28
బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరపాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమారస్వామి గీసుకొండ మండల కేంద్రంలో ఆమరణ నిరహర దీక్ష కొనసాగిస్తున్నాడు. దీనికి సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారుముఖ్యఅతిథిగా యూనివర్సిటీ అధ్యాపకులు వచ్చేసి పూలదండలు వేసి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కే వీరస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వివిధ పాత జిల్లా కేంద్రాలలో బహిరంగ సభలు జరిపి అనేక శిక్షణల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది వాటిలో ముఖ్యమైనది బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ దీనినే కామారెడ్డి డిక్లరేషన్ అని కూడా అంటారు దీనికి రాహుల్ గాంధీ హాజరై కుల గణన చేస్తూ జనాభా నిష్పత్తి కనుగుణంగా అన్ని వర్గాలకి ఫలాలు అందేటట్లు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంతవరకు బీసీల రిజర్వేషన్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దాంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ప్రజలందరూ ఆందోళనకు గురై వివిధ మార్గాలలో నిరసనలు తెలుపుతున్నారు వాటిలో భాగంగానే చాపర్తి కుమారస్వామి గాడ్గే నాలుగో రోజుకు ఆమరణ నిరాహార దీక్ష గీసుకొండ గ్రామంలో చేరుకున్న సందర్భంగా దీక్షకు కూర్చున్నాడు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక ప్రకటన చేసి ప్రజల్లో ఉన్న ఆందోళన తగ్గించడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది లేకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని నొక్కి సత్యానించారు తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర నాయకులు సోమ రామమూర్తి మాట్లాడుతూ బీసీ ప్రజల న్యాయమైన డిమాండ్ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడిగితే వారిని ఇబ్బందులకు గురిచేసి హైదరాబాదు నుండి గీసుకొండకు అర్ధరాత్రి తీసుకువచ్చి వాళ్ళ ఇంట్లో పడేసి ఏం చేసుకుంటారు చేసుకోండి అని పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అప్రజాస్వామీకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డి బిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంచు రాజేందర్,జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్,తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అర్బన్ కమిటీ, ఐతం నగేష్, దేవేందర్ రెడ్డి, ఎండి అంకుష్ వాలి, ఆనంద్, హాజీ, గొప్ప బోయిన రాజు, దార సూరి అలాగే బీసీ బహుజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి రామారావు తదితరులు పాల్గొన్నారు

Related posts

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ