*కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి*
కరీంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 కరీంనగర్ ప్రతినిధి:-శాయంపేట హావేలి గ్రామంలో ఉన్నా కాకతీయుల కాలంలో నిర్మితంఐనా శ్రీ ఆది మహాలక్ష్మి సమేత పాంచాల రాయస్వామి ఆలయ అభివృద్ధి కొరకు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చినా ప్రసాద్ పథకంలో చేర్చి పాంచాల రాయుడి ఆలయ అభివృద్ధికి సహరించాలని కోరుతు పాంచాల రాయుడి స్థలపురాణం, ఆలయ విశిష్టతను తెలిపే పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుకి అందించిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమారు. అలాగే కాకతీయ మేఘ టెక్టైల్ పార్కులో నష్ట పరిహారం అందని రైతులకు నష్ట పరిహారం అందేలా, స్థానిక యువతకు ఉపాధి, మరియు భూమి కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే 100 గజల బదులుగా మరో 50 గజాలు భూమి అందించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరడం జరిగింది దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి త్వరలో శాయంపేట గ్రామంలో ఉన్న పాంచాల రాయుణ్ణి దర్శించుకొని, టెక్టైల్ పార్క్ సమస్య పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలపడం జరిగింది.