*వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది* మహబూబాబాద్ జిల్లా//కొత్తగూడ మండలంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-తాసిల్దార్ జూనియర్ అసిస్టెంట్ జనగం పాపారావు అభినందించిన అధికారులు.కొత్తగూడ మండల సమీపంలోని గుంజేడుతోగు వాగులో గత రాత్రి చుంచ శివ అనే యువకుడు వాగు దాటుతూ ప్రమాదవశాత్తు కొట్టుకపోగా కాపాడిన. కొత్తగూడ పోలీసులు, తాసిల్దార్ సిబ్బంది గంగారం మండలం గంగారాం గ్రామానికి చెందిన ముగ్గురు నర్సంపేట నుండి బైక్ పై వస్తుండగా కొత్తగూడ మండల కేంద్రం గాంధీనగరం సమీపంలోని గుంజేడుతోగును దాటుతుండగా వాగు ఉదృతకు శివ అనే యువకుడు వాగులో కొట్టుకుపోయాడు మిగిలిన ఇద్దరు బండిని వెనకకు తీసుకువెళ్లి చీకటిలో వెతికారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడ పోలీసులు. తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది వాగువద్దకు చేరుకున్నారు వాగుకు కొద్ది దూరంలో చెట్టును పట్టుకొని ఉన్న శివను గమనించిన పోలీసులు తాడుతో కాపాడడానికి ప్రయత్నించారు తాడు వరద తాకిడికి అక్కడికి చేరుకోలేక పోవడంతో తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పాపారావు ఈత కొట్టుకుంటే వెళ్లి శివకు తాడు కట్టి బయటికి తీసుకొచ్చారు. రాత్రి ధైర్య సహసాలు చేసి ప్రాణాలు కాపాడిన జనగం పాపారావును తాసిల్దార్ రమాదేవి ఎస్ఐ కుశ కుమార్ అభినందించారు.
