జై భారత్ వాయిస్ న్యూస్ కాజీపేట
హనుమకొండ : ప్రముఖ దర్గా ఉత్సవాలుగా పేరుగాంచిన దర్గా కాజీపేట లోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా ఉత్సవాలలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి దర్గా కాజీపేట లోని దర్గాకు వచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ కు దర్గా పీఠాధిపతి సయ్యద్ షా గులాం అఫ్జల్ బియబాని ( ఖుస్రూ పాషా ), తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.దర్గాను దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ పీఠాధిపతి ఖుస్రూ పాషా, ఇతర ప్రముఖులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.స్పీకర్ తో పాటు దర్గాను దర్శించుకున్న ప్రముఖులలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు, తదితరులు ఉన్నారు.జిల్లా యంత్రాంగం తరఫున స్పీకర్ ప్రసాద్ కుమార్ కు జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో వెంకటేష్ పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు.
next post