Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-
హనుమకొండ రాంనగర్ లోని కొండా దంపతుల క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆపద సమయాల్లోనైనా ప్రజలకు ఎల్లవేళలా కొండా దంపతులు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కొండా మురళీధర్ రావు తెలిపారు. ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చిన కొండా దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు ప్రజలకు మరోసారి స్పష్టం చేశారు.

Related posts

ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి

Jaibharath News

కిట్స్ లో ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం ఫర్ హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News