Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ


జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వంచనగిరి గ్రామంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు వారికి పలు సూచనలు చేశారు.గ్రామంలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించి, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇంటింటి జ్వర సర్వే చేపట్టి మందులు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామంలో దోమల నివారణకు చేపడుతున్న యాంటీ లార్వెల్ ఆపరేషన్లను పరిశీలించారు. ప్రజలు కూడా వ్యక్తిగత  పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని తెలిపారు. ప్రజలు  నీటిని కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని  నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సేవించకుండా తాజాగా వేడిగా ఉన్న పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నందున వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ దేవేందర్, సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి, ఇంచార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్లు కిరణ్,సదానందం, ఫార్మసిస్ట్ సాగర్, హెల్త్ అసిస్టెంట్ రఘు ప్రసాద్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం లో హనుమాన్ చాలీసా పారాయణం

మచ్చ పూర్ లో పంటనష్టపరిహార చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

Jaibharath News

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*