April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

జై భారత్ వాయిస్ సెప్టెంబర్ 5. గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్ లో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గీసుకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, ఎంఆర్సీ సిబ్బందికి, గీసుకొండకు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ తన స్వంత ఖర్చులతో ఘనంగా పూలమాలలు వేసి, శాలువా మెమొంటోలతో సత్కరించారు. 2023 – 24 పదవ తరగతి ఫైనల్ పరీక్షలో 9.6 ..9.0..8.7 జిపిఏ ఉతీర్ణత సాధించిన విద్యార్థులుకు 5000 వేలు 3000 వేలు 2000 వేలు, అలాగే 5 వ తరగతిలో విద్యార్థులకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ 5 వేలు, 3 వేలు, 2 వేలు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈకార్యక్రమంలో స్థానిక హైస్కూల్ హెడ్మాస్టర్ ఎం. పట్టాభి, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ రవిందర్, గీసుకొండ వాస్తవ్యులు, ఎంపీపీయస్ పంతులుపల్లి హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి  ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు విటోభా, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్న ప్రభ, పద్మ, సబిత, ఉషారాణి, నేతాజి సర్విస్ టీమ్ అధ్యక్షులు మొగసాని శంకర్.ములుకుంట్ల రాజ్ కుమార్, నర్సయ్య ఎంఆర్సీ సిబ్బంది సారిక,  తదితరులను ఘనంగా సత్కరించారు.

Related posts

మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.

Jaibharath News

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

Jaibharath News

భగత్ సింగ్ కి నివాళి