Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తూర్పు కోటలో కొండా దంపతులు మట్టి వినాయకుల పంపిణి

*తూర్పు కోటలో కొండా దంపతులు మట్టి వినాయకుల పంపిణి*

వరంగల్ జిల్లా//ఖిల్లా వరంగల్

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-

ఖిలా వరంగల్ తూర్పు కోట పోచమ్మ దేవాలయం ముందు కొండా దంపతులు నియోజకవర్గం ప్రజలకు ఉచితంగా అందించిన మట్టి వినాయకులను కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రేస్ ముఖ్య నాయకులు అందరు కలిసి ప్రజలకు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, డివిజన్ కాంగ్రేస్ అధ్యక్షులు బోయిని దూడయ్యలు మాట్లాడుతూ పర్యావరణను పరిరక్షించేందుకు మట్టి వినాయకులను పూజించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ – మురళీధర్ రావులు సొంత ఖర్చులతో ప్రతి ఇంటికి మట్టి వినాయకులను అందిస్తున్నారని వారికి ప్రజలందరి తరుపున ధన్యవాదములు తెలిపారు. శుక్రవారం వరకు ప్రజలందరికి మట్టి వినాయకులను అందించే విదంగా డివిజన్ లోని అన్ని బ్లాకుల ఇంచార్జ్ లతో అవసరం ఉన్న ప్రతి కుటుంబానికి కాంగ్రేస్ కార్యకర్తలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు బెండద వీరన్న, మాజీ మార్కెట్ డైరెక్టర్ సంగరాబోయిన చందర్, బంగారి శ్రీను, ఆరసం రాంబాబు, ఏసిరెడ్డి రమేష్, బోలుగొడ్డు శ్రీనివాస్, శిరబోయిన ఎల్లయ్య, అల్లం కేశవరాజు, కుమార్, నరేష్, ఐలయ్య, రాజమల్లు, రాజు, ప్రతాప్, కర్ణాకర్, దేవేందర్, ప్రభాకర్, కిరణ్, గిరిలతో పాటు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

దివ్యాంగ సంఘల నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు

Jaibharath News

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం