Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రజాకవి కాళోజి నారాయణరావుకు ఘన నివాళి*

<span;>జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వద్దన్నపేట
<span;>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజాకవి కాలోజి నారాయణరావు 110 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకై ప్రజా గొంతుకై ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి తెలంగాణ స్వరాష్ట్రం కోసంతన రచనలతో నవలలతో సమాజాన్ని చైతన్య పరుస్తూ పూర్తి దాయకంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించిన మహాకవి కాలోజి నారాయణరావు ఆశయాలను తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మానంలో భాగం పంచుకొని కాళోజి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు కాళోజి నారాయణరావు సూచించిన మార్గ లక్షణాలను అవలంబించాలని అన్నారు కాళోజి చెప్పిన మాటలను స్మరించుకొని ఆయన ఆశాలను కొనసాగించే దిశగా ప్రభుత్వం ప్రయాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కంచర్ల మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిమిరెడ్డి రామచందర్ రెడ్డి, ప్రజా సంఘ నాయకులు మామిండ్ల చెన్నయ్య, పేదజన భూసాధన కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరిపట్ల అంజయ్య, బరిగల డానియల్, అబిడి సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఎస్ఎంసి, డిఎంహెచ్ఓ అధికారుల దాడులు వెంటనే ఆపాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆర్ఎంపీ డాక్టర్లు

Sambasivarao

గీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

Sambasivarao

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News