May 13, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనికి వెళ్ళాలి అంటే బురదలో నడుచుకుంటూ వెళ్ళల్సిందేనా…???

భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వద్దన్నపేట ప్రతినిధి:-వర్షాలు పడుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు, రోగుల బంధువులు. మున్సిపాలిటీ అధికారులు ఆస్పత్రి ముందు డ్రైనేజీ నిర్మించక పోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని  ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్య గురించి తెలిపినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు.  మున్సిపాలిటీగా మారినప్పటి నుండి కోట్లు ఖర్చుపెట్టీ అభివృద్ధి చేసినం అని చెప్పుకుంటున్న పాలకవర్గం అధికారులు. మరి ఈ సమస్య ఏంటని నిలదీస్తున్న పట్టణ ప్రజలు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆస్పత్రి ఇరుపక్కల డ్రైనేజీ కాలువ నిర్మించి నీరునిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు, రోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ  పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి

ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు

Jaibharath News
Notifications preferences