జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హన్మకొండ
ప్రముఖ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ,కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలిగెత్తి చాటిన గొప్ప మానవతావాది ప్రజా కవి కాళోజిని అని కావ్య అన్నారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ నిరంకుశ పాలకులను నిలదీసిన ప్రజా కవి కాళోజి చిరస్మరణీయుడని వరంగల్ ఎంపీ స్పష్టం చేశారు. నిక్కచ్చితనం తన రచనలలో భాగమని నైజాం పాలనలో రజాకారులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి అరాచకాలు సృష్టించినప్పుడు అవకాశం చిక్కితే ఆ పాలకులను కాటేసి తీరాలంటూ నా గొడవ ద్వారా స్పష్టంగా పిలుపునిచ్చారని అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనంద దాయకమన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా వరంగల్లులో కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభించు కోబోతున్నాం అన్నారు.