*ఇల్లంద గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//ఇల్లంద గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వర్ధన్నపేట ప్రతినిధి:-
చిట్యాల ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా ఇల్లంద గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 39 వ వర్ధంతి కార్యక్రమంలో ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కనబరిచిన తెగువ ప్రస్తుత సమాజానికి మరియు భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకం చిట్యాల ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లంద రజక సంఘం అధ్యక్షులు మునుకుంట్ల సూరయ్య యువజన అధ్యక్షులు మునుకుంట్ల రాము రజక సంఘం సేవాదళ్ అధ్యక్షులు పరకాల శ్రీనివాస్ ఎలిశాల సిరిచందన మునుకుంట్ల ఆనందం పరకాల యాదగిరి కందుల శ్రీనివాస్ పరకాల నాగరాజు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డల పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.