*భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో
సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాణా ప్రతాప్ రెడ్డి*
వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//లింగాపురం గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి:-
చెన్నారావుపేట మండల అధ్యక్షులు దుంకదువ్వ రంజిత్ అధ్యక్షతన లింగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటే అది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే, అలాంటి నాయకునికి మద్దతుగా నిలిచి సభ్యత్వం పొంది, ప్రతి బూతులో బూత్ అధ్యక్షులు సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టాలనీ అన్నారు మరియు నర్సంపేట నియోజకవర్గ ప్రతి కార్యకర్త భాధ్యతయుతంగా సభ్యత్వ నమోదులు చెయ్యాలని కోరారు, గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ పాలన చూసి ప్రజలందరూ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంటేస్టేడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, అజ్మీరా శ్రీను, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, రాధ కృష్ణా, పృధ్వీ, విజయ్, గ్రామ సీనియర్ నాయకులు, మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.