*కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టేస్కాబ్ చైర్మన్ మార్నెనీ*
హన్మకొండ జిల్లా//అయినవోలు మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వర్ధన్నపేట ప్రతినిధి:-
ఐనవోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరు అయిన 91 లక్షల 10 వేల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు మరియు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరు అయినా 18 లక్షల 95 వేల రూపాయల చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజుతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.