జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వరంగల్ ప్రతినిధి:-ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గీసుకొండ మండలంలో దెబ్బతిన్నటువంటి గంగదేవిపల్లి, మనుగొండ గ్రామాల ప్రధాన రహదారి లో ఉన్న కెనాల్ దగ్గరి బ్రిడ్జి దెబ్బతినడంతో గ్రామ బస్ సర్వీస్ నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో ప్రతిరోజు గ్రామం నుండి ఉన్నత చదువుల కోసం వేరే ఊర్లలోని పాఠశాలలకు కాలేజీలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులకు ఇబ్బందిగా ఉండడంతో దూర దృష్టిగల కొంతమంది విద్యార్థులు ప్రతి క్షణం ప్రజాసేవకోసం పరితపించే మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్ ని కలిసి తమ బాధలని తెలియపరచి దెబ్బతిన్న రహదారికి మరమ్మత్తులు చేసి తిరిగి బస్సు సౌకర్యం కల్పించాలని కోరడంతో వెంటనే స్పందించి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందికొండ రాజుకి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కునమల్ల అనిల్ కి ఈ సమస్య గురించి తెలిపి. రోడ్డు మరమ్మత్తులకు కావలసిన ఏర్పాట్లను చేసి రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్డుని మరమ్మతు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీకాంత్, కందికొండ రాజు, కునమల్ల అనిల్, యంబాడి రాజమౌళి, దేవ నాగరాజు, గుర్రం మల్లేష్, గోపతి రాము తదితరులు పాల్గొన్నారు.

previous post