జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 హనుమకొండ ప్రతినిధి:-ఉద్యమకారుడు జర్నలిస్ట్ మెరుగు శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తరుణంలో విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క వారిని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చారు. నాడు ఉద్యమంలో పనిచేసిన మెరుగు శ్రీనివాస్ వారి ప్రేమ వివాహమును సీతక్క కుంజ రామన్న వారి చేతుల మీదుగా వివాహం చేసినారు నేడు మంత్రిగా ఉన్న వారి సోదరుడిని మరచిపోకుండా అదే ఆప్యాయంగా అండగా ఉన్నారు వైద్యులను మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య కొత్తగూడ, సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు, జాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగారం, సువర్ణపాక సరోజన ఎక్స్ ఎంపీపీ గంగారం, ఈసం రమా సురేష్ మాజీ జెడ్పిటిసి గంగారం, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post