Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తూర్పు కోటలో మహా అన్న ప్రసాద కార్యక్రమం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పు కోట ముదిరాజ్ వాడ సీరబోయిన వీధిలో మహా అన్నధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్న ధన కార్యక్రమం నిర్వహించిన నిర్వహణ కమిటీని అభినందించి. ఆ గణపతి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈసందర్బంగా ప్రత్యేక పూజలో పాల్గొని అనంతరం భోజనాలు వడ్డీంచి, భోజనం చేసారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ వీధి ముఖ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు శిరబోయిన శ్రీనివాస్, వాసుదేవ్, రాజన్, కిరణ్, సతీష్, ప్రసాద్, నవీనులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి..మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

Jaibharath News

బోర్ పనులు ప్రారంభించిన ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి

Sambasivarao