Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ వాలంటరీగా ఉపాధి కల్పించిన సీఎంరేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ వాలంటరీగా ఉపాధి కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి గీసుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్  ధన్యవాదాలు తెలిపారు హోంగార్డు తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు విధులు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు దీంతో వారికి కొంత ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి కల్పన లభిస్తుందన్న గొప్ప సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి దని అన్నారు ఆయన ఆలోచన విధానానికి  ధన్యవాదాలు  తెలిపారు.

Related posts

టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక

నర్సంపేట స్నేహా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

Sambasivarao

టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

Sambasivarao