January 10, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి.-వారి పాదాలు కడుగుతాం.

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 20 ) గ్రామాలు పరిశుభ్రంగా వున్నాయంటే గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల చలువేనని జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డిఆర్డీఓ కౌసల్య దేవి అన్నారు.స్వచ్చతా హీ సేవ పక్షోత్సవాల్లో బాగంగా గీసుకొండ మండలములోనీ ఊకల్ గ్రామాన్ని శుక్రవారం సందర్శించి గ్రామములో చేపడుతున్న పారిశుధ్య పనులను వారు పరిశీలించారు.ఈ సంధర్భంగా సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థులు తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్రమైన కలుషితాలను, తడి,పొడి చెత్తను ఓపికగా సమీకరించి డంపింగ్ యార్డ్ లకు చేర్చే మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి అన్నారు.స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో వారికి రెండు నెలలకు ఒక సారి హెల్త్ చెకప్ చేయించాలని మండల మెడికల్ అధికారిని కోరారు. బూట్లు,గ్లౌజులు,మెడికల్ కిట్లు,గుడ్లు, పౌష్టిక ఆహారాన్ని అందించాలని పంచాయితి కార్యదర్శి నీ ఆదేశించారు. డి డిఆర్డీఓ కౌసల్య దేవి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న మల్టిపర్పస్ వర్కర్లు చేస్తున్న సేవలకు వాళ్ల కాళ్ళు కడుగుతామని అన్నారు.వారికి గ్రామ పంచాయతీల నుండిహెల్త్ ఇన్స్ూరెన్స్ చెపించాలనీ సూచించారు. గ్రామ నైసర్గిక స్వరూపాన్ని విలేజ్ మ్యాప్ ద్వారా పంచాయితి కార్యదర్శి, మహిళా సంఘం సభ్యుల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమములో స్వచ్ భారత్ కన్సల్టెంట్ శ్రీనివాసరావు,అడీ షినల్ పిడి మంజుల దేవి, ఇన్చార్జి ఎంపిడిఓ కమలాకర్, ఎంపిఓ అడేపు ప్రభాకర్, మెడికల్ ఆఫీసర్ మమత, ఎ యన్ యం సదాలక్ష్మీ,ఏపీఎం సురేష్ కుమార్, ఎపిఓ చంద్రకాంత్, క్లస్టర్ టి ఎ లు జెల్ల సుధాకర్,సురేష్, పంచాయితి కార్యదర్శి శ్రీధర్,గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై చట్టరిత్య చర్యలు

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేడుకలు

Jaibharath News
Notifications preferences