April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్23
వరంగల్ జిల్లా పరకాలనియోజకవర్గ పరిధిలో యువతకు, మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంగెం, గీసుకొండ తో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3836మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్తాయి నివేదికను అధికారులు రూపొందించాలన్నారు. ఉపాధి కల్పనపై రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులు కృషి చేయాలన్నారు.వివిధ పరిశ్రమల్లో విడతల వారిగా ఉపాధిని కల్పంచాలన్నారు.18 నుండి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అర్హతమేరకు టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సెట్విన్ ఎండి మన్మోహన్, పరిశ్రమలు, ఉపాధి కల్పన, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామసభల నిర్వహణ: రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ