Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

చాకలి ఐలమ్మ 129‌వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మేయర్ ఎమ్మెల్యేలు ఎంపీ

*చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మేయర్ ఎమ్మెల్యేలు ఎంపీ* 

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 హనుమకొండ ప్రతినిధి:-

కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మకి గౌరవంగా యూనివర్సిటీ పేరు నామకరణం చేసిన ఘనత.

గడీలలో గడ్డి మొలవాలనే చాకలి ఐలమ్మ నినాదాన్ని ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని సాగుతుంది. తెలంగాణ వీరానారి, భూమి కోసం భుక్తికోసం, రజాకార్ల పై రైతంగా సాయుధ పోరాటాలు చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినా దీరవనీత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ న్యూ శాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సత్య శారదా, ప్రవీణ్యతో కలిసి పూలమాల వేసి నివాళీలు అర్పించారు. నాటి రజాకార్ల పాలనలో అణగారిని వర్గాల ప్రజలకు, రైతులకు తన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తి దాయకమని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చాకలి ఐలమ్మ ఉనికి పూచ్చుకొని ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వ పాలకులు చాకలి ఐలమ్మని చిన్నచూపు చుసిన దాఖలాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాకలి ఐలమ్మ సేవలకు గౌరవంగా హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వాటి పేరు నామకరణం చేశామని, చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా నియమించుకున్నామని తెలిపారు. నాడు దొరల గడిలలో గడ్డి మొలవాలనే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమిత భూములపై ఉన్న దొరల పెత్తనాన్ని హైడ్రా ద్వారా కూకటివేళ్లతో ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. మహానగరంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థాయికంగా ఏర్పాటు చేసిన రక్తాధాన శిబిరన్ని ప్రారంభించారు. దాతలకు ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. డిఎంహెచ్ఓ. డాక్టర్ అప్పయ్య

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల

Sambasivarao

పెద్దాపురం లో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

Jaibharath News