April 8, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

*వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే*

హన్మకొండ//వడ్డేపల్లి జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58 వ డివిజన్ వడ్డేపల్లిలో ది ఇండియన్ పెంతకొస్టల్ చర్చ్ వారి సౌజన్యంతో నూతన చర్చ్ (ఆలయ పునాది)కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. భారతదేశం సర్వమత సమ్మేళనం, అన్ని మతాలను గౌరవించే గొప్ప సంప్రదాయం కలిగిన దేశం. సర్వమత సామరస్యం అనేది అంతర్గతంగా భారతీయ భావన. భారతీయ సంస్కృతి, వైవిధ్యమైనది, అనేక నమ్మక వ్యవస్థలు ఒకే పరిసరాలలో తమ సరైన స్థానాన్ని పొందే ఒక ప్రత్యేకమైన వాస్తవికతను అందిస్తుంది. ఆలయ పునః నిర్మాణంలో అందరు ఏకమావడం చాలా శాంతిషకరమైన తరుణం. మన ఒడిదోడుకుల ప్రపంచంలో ఉదయంలో వేల సగటు మనిషి తాను నమ్మిన దేవుడి సన్నిధిలో కూర్చోవడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఎమ్మెల్యేగా నా వంతు భాద్యతగా ఆలయ నిర్మాణం(చర్చ్) లో భాగస్వామ్యం అవుతాను. నా చిన్నతనం నుంచి చూసిన చర్చ్ లో అభివృద్ధి చెందటం ఒక శుభపరిణామం. ఈ సందర్బంగా స్థానిక పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా నాయకులు డా,, శ్రవణ్, స్థానిక డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, పున్నం చందర్, ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షులు మేరీ, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రవీందర్ (జేక్) పాస్టర్ కోర్నిలేఎస్, స్టేట్ పాస్టర్ అధ్యక్షులు హరోన్, టీసీఫ్ పాస్టర్లు మరియు వరంగల్ ఏరియా పెంతకొస్టల్ పాస్టర్ లు, వడ్డేపల్లి ఐపీసీ పెద్దలు, విశ్వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ యువ నాయకుడు

Jaibharath News

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News

టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్