Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 02
బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుక ను  పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో, దుర్గేశ్వర స్వామి దేవాలయం,శివనగర్, శాఖరాశికుంట లతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో  నగర మేయర్  గుండు సుధారాణి,  వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారదలతో కలసి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనటం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉజ్వల తెలంగాణ  ఆవిష్కరణ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా  రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు

Related posts

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక