April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, కంటి చూపుతో రాజకీయాలను శాసించే అదృశ్య శక్తి మంత్రి సీతక్క గురువారం ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభకి ముఖ్యఅతిథిగా హాజరైన పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి  ఘన స్వాగతం పలికారు, పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీని వేదిక మీదకి సీతక్క ఆహ్వానించారు. ప్రధానతరం గిరిజన పోరాట వీరుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా ప్రతిమను బహుకరించి రాహుల్ గాంధీని మంత్రి సీతక్క సత్కరించారు. శుక్ర వారం నాడు బిర్సా ముండా జయంతి నేపథ్యంలో సీతక్క బహుకరించిన బిర్సా ముండా ప్రతిమ రాహుల్ గాంధీని ఆకట్టుకుంది. బిర్సా ముండా ప్రతిమను అందుకున్న రాహుల్ గాంధీ కాసేపు ప్రతిమను చూస్తూ వుండి పోయారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆదివాసి గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివాసీల ఆస్తిత్వాన్ని, ప్రత్యేక సంస్కృతిని దెబ్బతీస్తున్న బిజెపి కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.*

Related posts

CM directs clearance of pending dues, releases Rs 7,358 Crore pending bills to employees

ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి