నారా రామూర్తి నాయుడు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన అమిలినేని సురేంద్ర బాబు
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి నారా రామ్మూర్తి నాయుడు చేసిన సేవలు ఎనలేనివని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నారా రామ్మూర్తి నాయుడు అందించిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుటుంబసభ్యులకి ఈ సందర్బంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.