April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కాంగ్రెసు పార్టీ అభివృద్ది కి కృషి చేస్తా

జై భారత్ వాయిస్ ఆత్మకూరు )కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సందీప్ మాట్లాడుతూ ఇటీవలే ఏఐసిసి ఆదేశాలనుసారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మండల అధ్యక్షునిగా గెలవడం జరిగిందని తెలిపారు.ఈ గెలుపు నా ఒక్కరిది కాదని నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరిదని నాకు సహకరించి నాకు ఓట్లేసి నన్ను గెలిపించిన ప్రతిఒక్కరికి ఈ గెలుపు అంకితం అని అన్నారు. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా నిలుస్తానని నా పై నమ్మకంతో నాకు ఎన్నికల్లో సహకరించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గెలిచిన యూవతను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించి మాట్లాడారు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసినకార్య కర్తలకు కష్టసుఖాల్లో అండగా నిలవాలని గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మదాసి శ్రీధర్, దామెర మండల అధ్యక్షులు,పరకాల మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపాధి పనుల పై అధికారుల సమీక్ష

Jaibharath News

అలరించిన సాధనా సూరుల విన్యాసాలు

Jaibharath News

పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు