Jaibharatvoice News 09 డిసెంబర్ :
సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో డిప్యూటీ కమిషనర్లు ఎంఈఓలు నిర్వాహకులతో క్రీడల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ నిర్వహణ ను అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా జీ డబ్ల్యు ఎం సి పరిధిలోని వరంగల్ ఖిలావరంగల్ కాజీపేట హనుమకొండ మండలాల్లో బల్దియా నుండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ నెల 10-12 వరకు నిర్వహించే మండల స్థాయి సీఎం కప్ మునిసిపల్ క్రీడలు వైద్య ఆరోగ్యశాఖ పోలీసు రెవెన్యూ శాఖ ల అధికారులు సమన్వయంతో నిబద్ధతతో ఆయా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని ఇందులో విద్యార్థిని విద్యార్థుల తో పాటు 18-35 సం.ల లోపు గల నగర యువత పెద్దయెత్తున పాల్గొనేలా వివిధ ప్రచార సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని బల్దియా తరపున క్రీడాకారులకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని ఈనెల 10, 11, 12 తేదీలలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించబడుతున్నందున ఇట్టి సదవకాశాన్ని నగర యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారుబల్దియా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని మేయర్ తెలిపారు.ఈ క్రీడా పోటీలను వరంగల్ లోని ఓ సిటీ ఖిలావరంగల్ గ్రౌండ్ శంభుని పేటలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ తో పాటు హన్మకొండ లోని జే ఎన్ ఎస్ గ్రౌండ్ లలో నిర్వహించనున్న నేపథ్యం లో ఆయా క్రీడలు నిర్వహించే ఆవరణ ఆయా క్రీడాంశాల కోర్టులు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయా క్రీడాంశాలకు చెందిన క్రీడా సామగ్రి పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని మేయర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సి ఏం హెచ్ ఓ డా
రాజారెడ్డి డిఎఫ్ఓ శంకర్ లింగం డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి రవీందర్ ఈ ఈ మహేందర్ ఎంఈఓ లు అశోక్ కుమార్ మనోజ్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post