Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

సందడిగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు వీక్షించిన ఎమ్మెల్యేలు,మేయర్, కలెక్టర్

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
తెలంగాణలోని వివిధ జిల్లా నుండి విచ్చేసిన క్రీడాకారులతో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలు సందడిగా మారాయి. రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలో వివిధ జిల్లా నుండి దాదాపు 1200 మంది క్రీడాకారులు, కోచ్ లు, సాంకేతిక అధికారులు విచ్చేశారు. వీరికి మంచి బలవర్ధకమైన భోజనంతో పాటు, మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించారు. గ్రామస్థాయి మొదలు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల సైతం ఈ పోటీల్లో పాల్గొనడం గమనార్హం. శనివారం ఉదయం మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యలు జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంకి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని హ్యాండ్ బాల్, సెపక్ తక్రా పోటీలను వీక్షించారు. ఆదివారం అన్ని క్రీడాంశాలు ఫైనల్ మ్యాచ్లు జరగనున్నట్లు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్ తెలిపారు. హ్యాండ్ బాల్ ముందంజలో వరంగల్…. రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్ బాల్ పోటీలో భాగంగా బాలుర విభాగంలో ఉమ్మడి వరంగల్ జట్టు బాలికల విభాగంలో ఉమ్మడి అదిలాబాద్ జట్టు ముందంజలో నిలిచి సెమీస్ కు చేరువయ్యాయి. శనివారం జరిగిన బాలుర లీవ్ మ్యాచ్లో రంగారెడ్డి 23-18 స్కోర్ తో నల్గొండ పై, వరంగల్ 36 -14 తో నిజామాబాద్ పై, మహబూబ్నగర్ 25- 12 తో హైదరాబాద్ పై, కరీంనగర్ 32- 14 తో మెదక్ పై, రంగారెడ్డి 12-9 తో ఖమ్మం పై, వరంగల్ 24 -11 తో అదిలాబాద్ పై విజయం సాధించాయి. బాలికలలో హైదరాబాద్ 12- 5 తో మెదక్ పై, అదిలాబాద్ 20-7 తో ఖమ్మం పై, మహబూబ్నగర్ 19 -10 తో రంగారెడ్డి పై, వరంగల్ 13 -9 తో కరీంనగర్ పై ,నల్గొండ 9-5 తో మెదక్ పై గెలుపొందాయి.
సెపక్ తక్రాలో రాణించిన హైదరాబాద్..
సెపక్ తక్రా మహిళల విభాగంలో హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల క్రీడాకారులు రాణించి ఫైనల్ లో ప్రవేశించారు.
సెమీఫైనల్ లో హైదరాబాద్, మేడ్చల్ పై, కామారెడ్డి, నిజామాబాద్ పై గెలిచి ఫైనల్లో ప్రవేశించాయి.‌
అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ లో హైదరాబాద్ జిల్లా జట్టు పెద్దపల్లిపై, మేడ్చల్ జట్టు అసిఫాబాద్ పై, కామారెడ్డి జట్టు సిద్దిపేటపై, నిజామాబాద్ జట్టు నల్గొండపై విజయాలు సాధించాయి.పురుషుల క్వాటర్ ఫైనల్ లో హైదరాబాద్ జట్టు మెదక్ పై ,అసిఫాబాద్ జట్టు కామారెడ్డి పై, రంగారెడ్డిజట్టు వరంగల్ పై మెదక్ ,కరీంనగర్ పై గెలుపొందాయి.

Related posts

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు