Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మండలంలోని 16 గ్రామ పంచాయితీలు సర్పంచులు వార్డ్ మెంబర్లకు ఎన్నికలు ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. అందులో భాగంగా ముందస్తు ఎలాంటి తప్పులు దొరలకుండా అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే అందుకే ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 16 గ్రామ పంచాయతీలను ఆరు క్లస్టర్లుగా విభజించి 8 మంది స్టేజి వన్ అధికారులు, 8 మంది సాయక అధికారులతో పాటు 16 మంది అధికారులకు స్టేజి 2 అధికారుల నియమించామన్నారు. వారందరికీ ఈరోజు నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ పాల్గొన్నారు. శిక్షణ నిర్వహకులు నరేందర్ రెడ్డి, రామన్న, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలి

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి