- (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
- తెలంగాణా ప్రాంత భక్తుల ఇల వెల్పైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయింది. వనదేవతలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. బుధవారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు వచ్చే భక్తులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఏర్పాట్లను చేయించారు. నేటి నుండి వారం రోజులపాటు సమ్మక్క సారలమ్మ, జాతర జరుగుతుంది. తల్లుల తో పాటు సౌడలమ్మ లకు విశేష పూజలను నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.. దీంతో భక్తులు పిల్లాపాపలతో ఆనందంగా వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర వచ్చే ఏడు జరుగుతుంది. మేడారం తరహా లో జరుగుతున్న ఈ మినీ జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించారు. తలనీలాల ను సమర్పించారు. మేకలు, కోళ్ళు ను దేవతలకు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జాతరలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి.
