(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా వేద పండితుల వేదమంత్రోత్సవాలతో శ్రీ మహంకాళి బీరన్న నందీశ్వర, సింహ వాహన ,పోతరాజు భోగన్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు వేద పండితుల మధ్య మంత్రోచ్చారణల తో కన్నుల పండువ గా నిర్వహిస్తున్నారు. శనివారం మండలం కేంద్రంలోని శ్రీ బీరన్న దేవాలయంలో నూతనంగా పునర్ ప్రతిష్టాప మహోత్సవ వేడుకల్లో భాగంగా వేద పండితులు రవి కిరణ్ శర్మ, రవీంద్ర శర్మ పర్యవేక్షణలో పండితుల బృందం గోపూజ విగ్నేశ్వర పుణ్య వాహనం పంచగవ్య ఆరాధన యంత్ర విగ్రహ మార్చనలు దీక్ష కంకణ ధారణ అఖండ దీపారాధన మూల మంత్ర జపం, ధాన్యాదివాసాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గొల్ల కురుమ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించుకున్నారు. గణపతి హోమం, మంత్రపుష్ప అభిషేకం, కలశారాధన నువేద పండితులు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదల వితరణ నిర్వహించి సాయంత్రం విశేష పూజలను నిర్వహించారు. దేవాలయ ప్రతిష్టాప మహోత్సవ వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డిలు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని విశేష పూజలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ బృందం తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆత్మకూరు మండల పరిధి లోని గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
