Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జూట్ ఉత్పత్తులపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )జూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అన్నారు.శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో గల ఎం.కె. నాయుడు హోటల్ లోని అపూర్వ హాల్ లో భారత ప్రభుత్వ టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ సహకారంతో జాతీయ జనపనార బోర్డు ఆధ్వర్యంలో జూట్ మార్క్ ఇండియా పథకం పై స్వయం సహాయక గ్రూపు (ఎస్ హెచ్ జీ) మహిళలకు, జ్యూట్ ఉత్పత్తిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారత టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ టెక్స్టైల్ కమిటి హైదరాబాద్ ఇంచార్జి అధికారి కె.శిరీష అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులోకలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన జనపనార ఉత్పత్తులు ప్రజల దినచర్యల్లో భాగం కావాలని అప్పుడే జనపనార ఉత్పత్తుల కు డిమాండ్ తో పాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. జనపనారతో ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే పలు రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చని ఈ దిశగా జూట్ ఉత్పత్తుల తయారిదారులు దృష్టి సారించి ఉత్పత్తులను పెంచాలని అన్నారు. జూట్ ఉత్పత్తులకు జూట్ బోర్డ్ లేబుల్ ఉంటే మార్కెట్లో డిమాండ్ తో పాటు మంచి ధర పొందవచ్చని అన్నారు. ఇందుకుగాను జాతీయ జనపనార బోర్డు వారు అందించే అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనపనార వినియోగం ఇపుడిపుడే పెరుగుతుందని వీటి ఆవశ్యకత పై ప్రజల్లో మరింతగా అవగాహన రావాల్సిన అవసరం ఉందని ప్రజల అవసరాలతో పాటు ప్రస్తుత మార్కెటింగ్ కు అనుగుణంగా జనపనార ఉత్పత్తులు రావాలని ఈ దిశగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉండాలని జనపనార ఉత్పత్తుల తయారీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ లో తయారు అవుతున్న జూట్ ఉత్పత్తుల నైపుణ్యం చూస్తుంటే సరైన మార్కెటింగ్ ఉంటే వరంగల్ ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని జూట్ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పించేలా జనపనార బోర్డుతో పాటుగా టెక్స్ టైల్ కమిటి సహకారం తీసుకోవాలని, తయారీదారులు తమ జూట్ ఉత్పత్తులకు టెక్స్ టైల్ కమిటీ ద్వారా అమోదం పొందితే అట్టి ఉత్పత్తులకు బ్రాండింగ్ వస్తుందని తద్వారా సరైన మార్కెటింగ్ జరుగుతుందని జనపనార ఉత్పత్తులను తయారుచేయడం ఎంత ముఖ్యమో వాటికి సరైన మార్కెటింగ్ లభించడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ అన్నారు.పర్యావరణానికి ప్రమాదకరం గా పరిణమించే ప్లాస్టిక్ స్థానంలో జూట్ ఉత్పత్తుల వినియోగం పెరిగేలా జూట్ తయారీదారుల సంఖ్య పెరగాలని కలెక్టర్ అన్నారు.వరంగల్ జిల్లాలో జనపనార ఉత్పత్తులు ప్రభుత్వ కార్యక్రమాల్లో, పథకాల్లో వినియోగించడం తో పాటుగా జూట్ ఉత్పత్తి దారులకు శిక్షణ, మార్కెటింగ్ కు జిల్లా పాలనా యంత్రాగం పూర్తిగా సహకరిస్తుందని కలెక్టర్ చెప్పారు. జూట్ మార్క్ ఇండియా పథకంపై స్వయం సహాయక మహిళ గ్రూపులు పూర్తిగా అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చెప్పారు. జనపనార ఉత్పత్తులు, మార్కెటింగ్ తదితర అంశాలతో కూడిన జూట్ మార్క్ ఇండియా పథకంపై భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వశాఖ టెక్స్ టైల్ కమిటి అసిస్టెంట్ డైరెక్టర్ జె.నిశాంత్ మేత్రాస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం వివిధ జనపనార ఉత్పత్తుల తో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ అదనపు కలెక్టర్ తిలకించి తయారీ దారులను అభినందించారు.ఈ సందర్భంగా జూట్ తో తయారుచేసి ప్రదర్శించిన పలు రకాల ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి, భారత ప్రభుత్వ టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నిశాంత్ జె. మెత్రాస్అసిస్టెంట్ డైరెక్టర్ దివ్యారావు, టెక్స్ టైల్ కమిటి క్వాలిటి అశ్యురెన్స్ అధికారి సి. సతీష్ కుమార్, టెక్స్‌టైల్స్ కమిటీ ఇన్‌చార్జ్ . శిరీష , డిఆర్డిఓ కౌసల్యదేవి, జీ డబ్ల్యూఏం సి మెప్మా అధికారులు ఎస్ హెచ్ జీ బృందాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు

వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!

ఘనంగా పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు