April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి *


(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మీద సీఏం నిల బెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ఎమ్మార్పీ ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు నద్దునూరు రఘు అన్నారు. ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని అన్నారు. ఉద్యోగ ఫలితాలు విడుదల చెయ్యాలని చెప్పారు. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండల కేంద్రము వద్ద చేస్తున్న దీక్ష 4 వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రఘు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అదే రోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో సి ఎం మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని అన్నారని చెప్పారు. ఇదివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లలో ఎస్సీల వర్గీకరణ అమలు అయ్యేలాగున అవసరమైతే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని
ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ లకు వర్గీకరణ అమలు చెయాలని సి ఎం ని కోరారు. తమను నమ్మించి మోసం చేశాడని మాదిగల గొంతు కోశాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ సాక్షిగా చట్టబద్ధత కల్పించి ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేసి తమకు సంపూర్ణమైన న్యాయం చేయాలని అన్నారు. లేని పక్షంలో తమ నుండి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. మంద కృష్ణ నాయకత్వంలో చేసిన 30 ఏళ్ల పోరాటం ఉద్యోగాల కోసం చేశారని అన్నారు. ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయకుండా మళ్లీ ఎన్నడో ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వర్గీకరణ అమలు చేసిన ఫలితం ఉండదని మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం వరకు నష్టపోతారని చెప్పారు. దీనికి సి ఏం కారణమని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ రాజకీయంగా అండగా నిలబడ్డాా మని అన్నారు. ప్రతిసారి వేదికల మీద నమ్మించి ఇప్పుడు తమ కే ద్రోహం చేస్తున్నాడని ఆరోపి చారు. ఈ మోసానికి ప్రభుత్వానికి తమ నుండి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు భవిష్యత్తులో తన వైఖరి మార్చుకోకపోతే గద్దె దించే వరకు అహర్నిశలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో మంద కృష్ణ ఏ పిలుపు ఇచ్చిన బాధలు ఎలాంటి ఉద్యమాల కైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వర్గీకరణ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లలో అమలు చేయించుకోకపోతే తాము తీవ్రస్థాయిలో నష్టపోతారని తెలిపారు. కార్య కర్తలు మేల్కోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి రేపటినుండే సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఏం ఈ ఎఫ్ జిల్లా నాయకులు అర్షం స్వామి, నత్తి చందర్ ,మాజీ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద రవి, నాగెల్లి రాజు, కార్యదర్శి అర్శం రాజేందర్, నిరుకుల్ల మాజీ సర్పంచ్ ఆర్షం బలరాం, జిల్లా నాయకులు ఆర్శం మొగిలయ్య, ఉపాధ్యక్షుడు అరశం సుధాకర్, గ ద్దల సుకుమార్ ,కలకోట రాజేష్, పెరుమాండ్ల శ్రీనివాస్, నత్తి రవి, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News

హనుమకొండలో శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

రానున్నది బి జె పి ప్రభుత్వం -బి జె పి ప్రచారం

Jaibharath News