Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హోలీ పండుగ వేళ .తీన్మార్‌ స్టెప్పులతో దద్దరిల్లిన కమిషనరేట్‌ కార్యాలయము

హోలీ వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో అధికారులు, సిబ్బంది తీన్మార్‌ స్టెప్పులతో సందడి చేసారు. హోలీ పండుగను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు ఉదయం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయముకు చేరుకున్న అధికారులు సిబ్బంది ముందుగా పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌కు అధికారులు, సిబ్బంది రంగులు పూయడంతో ప్రారంభమైన హోలీ సంబురాల్లో సిపితో పాటు డిసిపి, ట్రైనీ ఐపిస్‌తో పాటు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది సైతం తమ స్థాయిలను మరిచి బ్యాండ్‌ వాయిద్యాల నడుమ తీన్మార్‌ స్టెప్పులతో హోలీ సంబురాల్లో మునిగితేలారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌తో ఇతర పోలీసులు సైతం బ్యాండ్‌ వాయిస్తూ పోలీసులత్లో జోష్‌ని నింపడంతో అధికారులు, సిబ్బంది ఉత్సహంగా స్టెప్పులు వేస్తూ పరస్పసరం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుపోవడంతో పాటు పోలీస్‌ కమిషనర్‌ను అధికారులు సిబ్బంది వారి భుజాలపై ఎత్తికొని పోలీసులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. పండుగ వేళ పోలీస్‌ కమిషనర్‌ విధులు పోలీస్‌ సిబ్బందికి రంగులు రాసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మీడియా ప్రతి నిధులు, సిబ్బంది సైతం పోలీసులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గోని డీజే టిల్లు పాటలకు చిందేసారు.
ఈ కార్యక్రమములో ఈస్ట్‌జోన్‌ డిసిపి అంకిత్‌ కుమార్‌, ఏ.ఎస్పీ మనన్‌భట్‌, అదనపు డిసిపి సురేష్‌కుమార్‌తో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఆర్‌.ఎస్‌.ఐలతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గోన్నారు

పోలీస్‌ కమిషనర్‌తో హోలీ సంబురాలుజరుపుకున్న వరంగల్‌ పశ్చిమ ఎమ్మేల్యే
హోలీ సంబురాల సందర్బంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మేల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకోని పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పరస్పర ఇరువురు రంగులు పూసుకొని పండుగశుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం పశ్చిమ ఎమ్మేల్యే పోలీస్‌ కమిషనర్‌ తీన్మార్‌ స్టేప్పులు వేసారు. పశ్చిమ ఎమ్మేల్యే వెంట మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ఈ.వి శ్రీనివాస్‌ వున్నారు.

Related posts

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

అగ్రంపహాడ్ జాతరకు సిపిని ఆహ్వానించిన పూజారులు*

Jaibharath News