Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!

హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సుంకరి జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ ముస్లిం సోదరులు 45 రోజులపాటు పవిత్రంగా జరుపుకునే పండుగలలో రంజాన్ చాలా ముఖ్యమైందని. కళాశాలలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని హిందూ ముస్లిం, క్రిస్టియన్ సాంప్రదాయాలను గౌరవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుశ్రీ, డాక్టర్ . అసీం ఇక్బాల్, డాక్టర్ ఫిరోజ్, ఆర్ట్స్ కళాశాల ఎన్జీవో సంఘం అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి సుశీల్ కళాశాల బోధ నేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్యకర్తలను కాపాడుకునే వారికే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి

Jaibharath News

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

Jaibharath News

వసతిగృహాలను జిల్లా కలెక్టర్‌ ప్రావిణ్య తనిఖీలు