April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పి. సాయికిరణ్, సంధ్యా రాణి ప్రతిష్టాత్మక మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ఎంపికై ఈనెల 17 నుంచి 22 వరకు వారం రోజులపాటు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందినారు.
దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత గల గణిత శిక్షణా శిబిరాలలో ఎంటీటిఎస్కు అధిక ప్రాధాన్యత ఉన్నది. మారుమూల ప్రాంత విద్యార్థులకు ఆధునిక గణితమును నేర్పించడంతో పాటు సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. వారం రోజులపాటు 40 మంది విద్యార్థులకు నెంబర్ సిస్టం, ఆల్జీబ్రా, సెట్ థియరీ, హోమోజీనియస్, నాన్ హోమోజినిస్ ఈక్వేషన్స్ గురించి అవగాహన కల్పించి వారి చేత సమస్యల పరిష్కార సాధన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత విభాగా ఇన్చార్జి అధిపతి డాక్టర్ టి నాగయ్య మరియు డాక్టర్ అంజన్ రావు డాక్టర్ రహమాన్ పాల్గొన్నారు.

Related posts

గంజాయి స్మగ్లర్ పై పీడీయాక్ట్

agrampahad sammakka mini jathara అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం- వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

ఆర్ట్స్ కళాశాలలో వివేకానందుని జయంతి వేడుక!