April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలొ మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన కోరారు.”A”గ్రేడ్ ధాన్యానికి 2320రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2300 రూపాయల మద్దతు ధరను ప్రకటించడం జరిగిందని రైతులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
కార్యక్రమం లొ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ నల్చర్ బాలాజీ,వైస్ చైర్మన్ యాదవ్ రావు, మార్కెట్ కమిటి చైర్మన్ దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ కె.శంకర్, పి సి సి డెలిగేట్ ఎవరు విట్టల్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ నాగ్ నాథ్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్, మాజీ జెడ్పీ టీ సీ నాగ్ నాథ్, సిద్దప్ప పాటిల్, మార్కెట్ కమిటి సాయిని అశోక్, ఖలీల్, తుకారాం, నౌషానాయక్, మల్లు, అనిల్ పాటిల్, పాషా సెట్, సాహిల్ సెట్కర్, జలీల్, నయీం, మునిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టిజిపిఎస్సీ హిందీ లెక్చరర్ స్టేట్ లో మద్నూర్ యువకునికి నాల్గవ ర్యాంకు

Valanke sachin kumar

కంకర వేశారు…రోడ్డు మరిచారు

ఛత్రపతి శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి లాడేగాంలో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

Valanke sachin kumar