గ్రేటర్ వరంగల్ నగరంలోఅపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దుకాణదారు కు రూ.18 వేల పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిఎంహెచ్ఓ మాట్లాడుతూ హన్మకొండ పరిధి 57 వ డివిజన్ గాంధీ నగర్ లో ఐస్ క్రీమ్ తయారీ చేసే ప్రాంతం ఆపరిశుభ్రంగా ఉందని సమాచారం అందిన నేపథ్యం లో బల్దియా శానిటేషన్ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించి గుర్తించి పెనాల్టీ విధించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి జవాన్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post