April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ హన్మకొండ);
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి లక్కర్సు ఈశ్వర్ ఆధ్వర్యం లో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ విద్యా వ్యాప్తి కోసం నిరంతర కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఆ తర్వాత వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్ ఉష శ్రీ ఆధ్వర్యంలో మనో వికాస కేంద్రం పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షులు కొండ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి లక్కర్స్ ఈశ్వర్ , వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ , జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రతిభ తిరుమల ఆర్థిక కార్యదర్శి సర్వేశ్వర్ మాజీ అధ్యక్షురాలు సంగీత ,పర్వతగిరి మండల అధ్యక్షులు రాజు, సంఘం మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ , రాయపర్తి మండల అధ్యక్షులు నవీన్ కుమార్ , విజయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోహసన్ పర్తి జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

Jaibharath News