Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ అడ్మిషన్లకు కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది Eap cet 2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మొదలవుతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ  ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు  మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తామని  ఈ పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు హాల్ టికెట్లు ఈనెల 19వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్య విద్యార్థులు ఉదయం సెషన్ లో ఉదయం 7:30 నిమిషాల నుండి లోనికి పంపించడం జరుగుతుందని మధ్యాహ్నం సెషన్  హాజరయ్యే విద్యార్థులకు ఒంటిగంట 30 నిమిషాలకు ప్రవేశం ఉంటుందని అన్నారు ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 జోన్లుగా విభజిస్తూ అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షల కోసం 112 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇంజనీరింగ్ పరీక్షల కోసము 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఈసారి 16  జోన్లుగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జేఎన్టీయూ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన లోనికి ప్రవేశం ఉండదని అన్నారు. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకుహాజరయ్యే విద్యార్థులు 2,19,420 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు అగ్రికల్చర్ ఫార్మసీ కి 86,101 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

Related posts

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి

2050- విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు

విశ్రాంత అధ్యాపక బృందం ఆత్మీయ కలయిక