April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇస్రో కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత నియామకం!

(జై భారత్ వాయిస్ హన్మకొండ) భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం (ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ లాదల జితేందర్, డాక్టర్ ఆలేటి సరిత లను నియమిస్తూ ఇస్రో చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకర జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి ఇరువురిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్రో ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం ముఖ్యంగా విద్యార్థులు పరిశోధనల పట్ల అవగాహన పెంపొందించే దిశగా పనిచేస్తారని ప్రస్తుతం ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మకమైన పరిశోధనల పై విద్యార్థులకు అవగాహన పెంపొందించుటకు వీరు ఇరువురు పనిచేస్తారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. డాక్టర్ జితేందర్ , డాక్టర్ సరితలను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు అభినందించారు.

Related posts

కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం.-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

24×7ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

తెలంగాణ ఆత్మను మేల్కొలిపిన వ్యక్తి అందెశ్రీ