April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నకిలీ పురుగు మందులు అమ్ముతే కేసులు నమోదు చేస్తాంఆత్మకూరు సిఐ సంతోష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
గ్రామాల్లో రైతులకు నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు అమ్ముతే షాప్ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఆత్మకూరు సిఐ సంతోష్ హెచ్చరించారు. శనివారం ఆత్మకూరు మండలంలోని గూడెపాడు, ఆత్మకూరు మండల కేంద్రంలోని పురుగుమందుల షాపులను ఆత్మకూరు సిఐ సంతోష్ వ్యవసాయ అధికారి యాదగిరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి విత్తన ప్యాకెట్లను పురుగుమందులను పరిశీలించారు. ఎక్స్ పేరైనా విత్తనాలను కానీ, పురుగుమందులను కానీ అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. రైతాంగానికి ఎవరైనా మోసం చేస్తే చర్యలను తీసుకోవాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారని ఆన్నారు. అందులో భాగంగానే ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అకస్మిక తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Related posts

గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

Jaibharath News