July 29, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్

దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్ డివిజన్‌కు 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ.ఆర్.టి.ఎస్) అధికారి అయిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, డివిజనల్ రైల్వే మేనేజర్(డి. ఆర్.ఎం)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ సికింద్రాబాద్ డివిజన్‌లో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్‌గా భాద్యతలను నిర్వహించారు. డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ ఐ.ఐ.టి ఢిల్లీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్; ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్.ఎం.ఎస్) నుండి ఎం.బి.ఎ మరియు సింగపూర్ యూనివర్సిటీ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్.యూ.టి.డి) నుండి ఇంజనీరింగ్ సిస్టమ్స్ అండ్ డిజైన్‌లో పి.ఎచ్.డి. డిగ్రీలను పొందారు. వారి వృత్తిపరమైన మరియు విద్యా నేపథ్యం సాంకేతిక నైపుణ్యం, వ్యూహాత్మక ఆలోచన మరియు నాయకత్వం యొక్క బలమైన మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది.
డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ గారి కెరీర్‌లో అనేక కీలక భాద్యతలను నిర్వహించారు. వారు అత్యంత సంక్లిష్టమైన ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థలో కార్యకలాపాలు మరియు వాణిజ్య విధులను సమర్ధవంతంగా నిర్వహించి రైల్వే బోర్డులో దేశవ్యాప్తంగా పెట్రోలియం లాజిస్టిక్స్‌కు నాయకత్వం వహించారు. వారి వృత్తిలో ఒక ప్రధాన మైలురాయి భారతీయ రైల్వేల డేటా అనలిటిక్స్ యూనిట్ స్థాపించి దానికి వారు ఆయన ఐదు సంవత్సరాలు నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో, ఈ యూనిట్ భారతీయ రైల్వేల కోసం కృత్రిమ మేధస్సు మరియు డేటా స్ట్రాటజీని అభివృద్ధి చేసింది మరియు ప్రయాణీకుల సేవలు, సరుకు రవాణా కార్యకలాపాలు, సిబ్బంది ఆప్టిమైజేషన్, మౌలిక సదుపాయాల ప్రణాళిక, మెటీరియల్ నిర్వహణ మరియు ట్రాక్ నిర్వహణ వంటి విభిన్న రంగాలలో అనేక వినూత్న వూపయోగకరమైన ప్రణాళికలు అమలు చేసింది. ఈ చొరవలు రైల్వే కార్యకలాపాల ప్రధాన భాగంలో డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని పొందుపరచడంలో సహాయపడ్డాయి. భారతదేశంలోని రాష్ట్రాలలో 4,80,000 కంటే ఎక్కువ గృహాలలో భారతదేశపు మొట్టమొదటి నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే (ఎన్.ఎచ్.టి.ఎస్) యొక్క భావనను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దీనిని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ అమలు చేస్తోంది. అంతగా డిమాండ్ లేని మార్గాల్లో సరుకు రవాణా ధరల రాయితీల కొరకు అల్గోరిథం రూపొందించడం, రిజర్వ్డ్ రైళ్లలో సీట్ల సామర్థ్యం ఆప్టిమైజేషన్ మరియు ఆటోమేటెడ్ సరుకు రవాణా టెర్మినల్ కేటాయింపు వంటి కార్యాచరణ విశ్లేషణలలో ఆయన కీలక పాత్ర పోషించారు. రైల్వే జంక్షన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి జాతీయ స్థాయి కమిటీలో కూడా కృషిచేశారు. డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ పరిపాలనకు మించి, గౌరవనీయమైన విద్యావేత్త మరియు పరిశోధకులు. ఆయన అగ్రశ్రేణి అంతర్జాతీయ పత్రికలలో అనేక పత్రాలను ప్రచురించారు మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి)లో రవాణా డిమాండ్ మోడలింగ్‌పై డాక్టోరల్ స్థాయి కోర్సులను బోధించారు. వారు సింగపూర్-ఎం.ఐ.టీం స్కాలర్‌గా, ఎం.ఐ.టీం-యూ.ఎస్.ఏ లోని ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ ల్యాబ్‌లో; మరియు సెంటర్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ అర్బన్ ప్లానింగ్ (సి.ఐ.ఎస్.టి. యూ.పి.), ఐ.ఐ.ఎస్.సిలో సందర్శన పరిశోధన పదవులను నిర్వహించారు.

Related posts

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

దేవదాయ శాఖ మంత్రి కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు