జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
ఓరుగల్లులో ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారి దర్శనమునకు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు మరియు ప్రసాద వితరణ ఏర్పాట్లు దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, గాండ్ల స్రవంతి, ఓరుగంటి పూర్ణచందర్. పాలడుగల ఆంజనేయులు, బింగి సతీష్ లు పర్యవేక్షించారు. శుక్రవారం నాడు అమ్మవారిని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఐ.ఏ.ఎస్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. పూజానంతరం అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

