July 29, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ కొరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ మేరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ జూలై 26, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేటాయింపబడిన హెల్ప్ లైన్ కేంద్రాలలో ప్రారంభమవుతోంది.ఈ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలలో B.E/B.Tech కోర్సులకు ప్రవేశం పొందవచ్చు. మొదటి దశలో సీటు పొందిన విద్యార్థులు తమ బెటర్మెంట్ ఆప్షన్ కోసం ఈ దశలో మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అలాగే, మొదటి దశలో సీటు రాకపోయిన అభ్యర్థులు కూడా ఈ దశలో పాల్గొనవచ్చు.ఈ రెండవ దశకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
స్లాట్ బుకింగ్ & ఫీజు చెల్లింపు:
జూలై 25, 2025
(మొదటి దశలో పాల్గొనని అభ్యర్థుల కోసం)
సర్టిఫికెట్ వెరిఫికేషన్:
జూలై 26, 2025
ఆప్షన్ల ఎంపిక:
జూలై 26 – జూలై 27, 2025
తాత్కాలిక సీటు కేటాయింపు:
జూలై 30, 2025 లోపు
ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్:
జూలై 30 – ఆగస్టు 1, 2025
కాలేజీకి భౌతిక హాజరు:
జూలై 31 – ఆగస్టు 2, 2025
జాయినింగ్ డీటెయిల్స్ అప్‌డేట్ (కాలేజీ ద్వారా):
ఆగస్టు 3, 2025
విద్యార్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరై,ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను వినియోగించుకోగలరు.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి:
https://tgeapcet.nic.in

Related posts

దేవదాయ శాఖ మంత్రి కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వరంగల్ జిల్లా తెలుగు మాస్టర్

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం