August 6, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని అధికారులకు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు, గీసుకొండ మండలంలోని కొమ్మల,విశ్వనాధపురం, మరియాపురం,శాయంపేట గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం గీసుగోండ మండల వివిధ గ్రామాలలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల తీరును అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలన్నారు.ఇంటి నిర్మాణం, పనులలో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అత్యధిక ధరలకు ఇసుక సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటే అదనంగా ఆ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అర్హులైన ప్రతి పేదవారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తామని అన్నారు.ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి దశలవారీగా బిల్లులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తుందన్నారు.ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదింటి వాడి సొంతకాల నెరవేరుతుందని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు.

Related posts

మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి.-వారి పాదాలు కడుగుతాం.

మంత్రి కొండా సురేఖకు జాతర ఆహ్వాన పత్రిక అందచేత

Jaibharath News

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

Jaibharath News