Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎస్జీటీలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం

( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్ జీ టీ ల)పై ప్రభు త్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పోతరాజు మురళి అన్నారు. వరంగల్ లో మాట్లాడుతూ అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు న్న ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ టీచర్స్ ను పట్టించు కోవం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు దాచుకున్న జీ పి ఎఫ్, టీజీ ఎల్ ఐ సి డబ్బులు విడుదల చేయక అనేక అవస్థల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఏన్నో ఏళ్లుగా పదోన్న తుల కోసం వేచి చూస్తున్న ఎస్ జీ టీలు నిరుత్సాహానికి గురవుతున్నారనిఆందోళన వ్యక్తం చేశారు.తమకూ అవకాశం కల్పిం చాలని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఖాళీగా ఉన్న సుమా రు వెయ్యి పోస్టుల్లో న్యాయపరంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నా సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పదోన్నతులు పొందకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పది వేల పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 10వేల పీఎస్ హెచ్ఎం లు పోస్టులు భర్తీ చేస్తే కొంతవ రకైనా తమ సమస్యలు తీరుతాయని అన్నారు. ఉన్నత పాఠశాలల మాదిరిగా ప్రాథమిక పాఠశాల్లోనూ పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తే బోధనేతర పనులు చూసుకోవడా నికి వీలు కలుగుతుందని, తద్వారా ప్రాథమిక పాఠ శాలల ఉపాధ్యాయులు విద్యాబోధనపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. 20 నుంచి 30 ఏళ్లపాటు పని చేస్తూ ఎలాంటి పదోన్నతులకు నోచుకోని ఎస్జీటీలకు ప్రతి పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే జిల్లాలో 200మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పారు.ప్రెమరీ పాఠశాలల టీచర్ల సమస్యలను పరిష్కరించ కుండా, బోధన, బోధనేతర పనులతో నిరంతరం ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహ రిస్తున్న తీరుతో గుణాత్మక విద్య ఎలా సాధ్య మవుతుందని అన్నారు.. ఎఫ్ఎల్ఎన్ ఫలితాల నమోదు, ఎఫ్ ఆర్ఎస్,మధ్యాహ్న భోజనం, వర్క్ బుక్స్, నోట్ బుక్ లు, పుస్తకాల ఫలితాలు మొక్కల వివరాలు, యూడైస్ లో వంద వివరాలను నమోదు చేయడం లాంటి పనులతో టైం సరిపోవడం లేదని అన్నారు. టీచర్ల కొరత వల్ల బోధనేతర పనులతో సతమతమవుతున్నారని ఆరోపించారు.

Related posts

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా రాజగోపాల్ పదవి బాధ్యతలు స్వీకరణ

Gatla Srinivas

వరంగల్ జిల్లా నూతన కలెక్టర్గా సత్య శారదా దేవి

adupashiva