జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
సామజిక ప్రయోజనం కోసం, ఆచరణాత్మక పరిష్కారాలను చూపడంలో ఇంజనీర్ ల పాత్ర ప్రధానం అన్నారు, కృత్రిమా మేధా నైపధ్యం లో నైపుణ్యాల పెంపు అవసరమని వరంగల్ TGNPDCL చైర్మన్ మానేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణం లోని సెనెట్ హాల్ లో, విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల (కో ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. రమణ అద్యక్షతన, బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు “ఓరియంటేషన్ కార్యక్రమం” లో ముఖ్య అతిధిగా టిజి ఎన్ పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి,కేయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప రెడ్డి ముఖ్య అతిథిలుగా హజరై విద్యార్థులను, వారి తల్లి తండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు“సిలబస్ కు పరిమతం కావద్దు” అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు, పాఠ్యపుస్తకములతో పాటు, పాఠ్యతేరా అంశాల పై కుడా ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నారు, మంచి వ్యక్తులుగా మారడానికి ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు, ఈ కార్యక్రమం లో కన్వీనర్ డాక్టర్ వి. మహేందర్ తో పాటు డాక్టర్ రాధిక, డాక్టర్ సుమలత, డాక్టర్ అసిం ఇక్బాల్ తో పాటు బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
